ఈ సినిమాకు కీలకమైన ఎమోషనల్ సీన్ కి నివేదా థామస్, అంజలి అలాగే అనన్యలు ప్రాణం పోశారు అని చెప్పవచ్చు. ఇక అంజలి కి బలమైన కోర్టు సీన్ ఒకటే అయినప్పటికీ ఆమె చాలా బాగా చేసింది. అంజలి ఇంత బాగా నటించగలదా అని చూసిన వారందరూ ఆశ్చర్యపోయేలా, ఆమె ఆ పాత్రలో లీనమైపోయి నటించింది. అనన్య విషయానికొస్తే, కొంచెం స్కోప్ తక్కువగా ఉన్నప్పటికీ ఈమె కూడా బాగానే నటించింది..