చిరంజీవి నర్సింగ్ యాదవ్ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా నర్సింగ్ యాదవ్ తన భార్యతో కొడుకులతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు చిరంజీవి ఆ పిల్లాడికి ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చాడని నర్సింగ్ భార్య చిత్ర చెప్పుకొచ్చింది. ఆ గోల్డ్ చైన్ దాదాపు 70 గ్రాముల కంటే ఎక్కువ ఉందని కూడా ఆమె తెలిపింది. అంతేకాకుండా చిరంజీవి భార్య సురేఖ కూడా చాలా సన్నిహితంగా ఉండేవారని ఆమె చెప్పుకొచ్చింది.