ఏప్రిల్ 22 వేల 21 న విడుదలైన వైల్డ్ డాగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ, నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్22న విడుదలయి భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.హాలీవుడ్ ,బాలీవుడ్ సినిమాలను సైతం పక్కకునెట్టి వైల్డ్ డాగ్ సినిమా నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుండడం గమనార్హం.. ఇక మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ వారే అధికారికంగా ప్రకటించడం మరో విశేషం..సౌత్ సినిమాల్లో కూడా అత్యధిక వ్యూస్ నమోదు చేసిన మొట్టమొదటి చిత్రంగా వైల్డ్ డాగ్ సినిమా నిలిచిందట.. ఇక మరో విశేషమేమిటంటే , తెలుగు వర్షన్ లో ఇండియా మొత్తం మీద టాప్ లో ఉండడం మరో విశేషం.. ఇక తమిళ వర్షన్ లో అయితే ఐదవ స్థానంలో నిలిచినట్లు వారే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు..