భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వారికి కావలసిన వ్యాక్సిన్ సరిగా అందడం లేదు. దయచేసి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను భారత్ కు సరఫరా చేయాలని, అమెరికా ప్రభుత్వ అధికారులను కోరుకుంటూ ప్రియాంక ట్వీట్ చేసింది.. ఇక ఇప్పటికే భారత ప్రభుత్వానికి అమెరికా ప్రభుత్వం తోడుంటానని హామీ కూడా ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే 550 మిలియన్ల ఆస్ట్రాజనెకా వ్యాక్సిన్ లను ఆర్డర్ చేసిందని, ఇక అమెరికాకు కావలసిన దానికంటే ,ఎక్కువ వ్యాక్సిన్లు వారి వద్ద ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం భారత్ చాలా ఇబ్బందుల్లో ఉంది. అందుకే వెంటనే ఇండియాకు ఈ వ్యాక్సిన్ లను పంపించగలరా..? అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు రిక్వెస్ట్ చేసింది ప్రియాంక చోప్రా..