"శ్రీకారం". ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ , హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్ అందించాడు. ఇందులో సీనియర్ నరేష్, సాయికుమార్,రావు రమేష్, తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించి, ఈ సినిమా కు హైలెట్ గా నిలిచారు. ఈ సినిమా ఇదే సంవత్సరం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే రీసెంట్ గా ఓటీటీలో విడుదలవ్వగా, అక్కడ మాత్రం ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేస్తోందని సమాచారం. సన్ ఎక్స్ట్రీమ్ లో తక్కువ సమయం లోనే అత్యధికంగా వీక్షించిన చిత్రంగా శ్రీకారం సినిమా నిలిచింది.