విక్టరీ వెంకటేష్ రీమేక్ సినిమాలలో నటించినప్పటికీ, అవి అన్నీ భారీ విజయాలను అందుకోవడం విశేషం. ఇక ఇప్పటికే ఈయన నటిస్తోన్న దృశ్యం 2, నారప్ప సినిమాలు కూడా రీమేక్ కథలే . ఇప్పుడు మరొకసారి మరో రీమేక్ చిత్రంపై వెంకీ దృష్టి పడినట్లు తెలుస్తోంది.ఆ సినిమా ఏదో కాదు..డ్రైవింగ్ లైసెన్స్ సినిమా. ఇది రెండేళ్ల క్రితం మలయాళంలో విడుదలైన సినిమా. పృథ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా, ఏకంగా 40 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా రైట్స్ ను చేజిక్కించుకున్న ట్లు సమాచారం. ఇక అందుకే ఈ సినిమాను వెంకటేష్ చేయబోతున్నారు.