పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం తెలుగులో భారీ డిజాస్టర్ ను చూసింది. అయితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట.ఈ రీమేక్ లో విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించబోతున్నాడు. ఇక తను తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి, శక్తి సినిమాలలో విలన్ గా నటించాడు. ఈ చిత్రాన్ని రుస్తుం ఫేమ్ టిను సురేష్ దేశాయ్ హిందీలోకి రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. తెలుగు లో భారీ డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం, అక్కడ హిట్ కొడుతుందో లేదో చూడాలి మరి..