ఈరోజు మహా కవి ఆత్రేయ శత దినోత్సవ సందర్భంగా ఆయన పాటలను ఈ రోజు స్మరించుకుందాం." ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో " అనే ఈ పాట ఇలా వినగానే చాలు, అలా మైమరచి పోతాము. ఇక ఈ పాట రాసిన ఆత్రేయ, గొప్ప భావకవి ఏమో అని సందేహం కలగకమానదు. "కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన "అనే పాటను రాశారు. ఇక ఈ పాట విన్న వారంతా గొప్ప సామ్యవాద కవి ఏమో అనుకున్నారు. "నేనొక ప్రేమ పిపాసిని" అని రాస్తే,ఇంతకుమించిన వైరాగ్య కవి లేడు అని అందరూ అన్నారు.