దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కెవ్వు కేక సినిమాలోని ఒక్క సన్నివేశం, అంటే చలపతిరావుకు సంబంధించిన బూతుల సీన్ వైరల్ అవడంతో, ఆ విషయంపై దర్శకుడు దేవి ప్రసాద్ స్పందించక తప్పలేదు. ఈ వీడియో రాత్రి నా దృష్టికి వచ్చిందండి. అలాంటి ఘోరమైన సన్నివేశం ఎలా జరిగిందో అప్పటికీ అర్థం కాలేదు. షూటింగ్ లో అయితే ఆయన బాగానే చెప్పారు. దాన్ని డబ్బింగ్ కు మాత్రం నేను వెళ్లలేదు. ఆ సన్నివేశాన్ని ఫాస్ట్ చేసి, ఎడిటింగ్ కు వచ్చిన డైలాగు మాత్రమే తెలుసు.. అంటూ దేవి ప్రసాద్ సోషల్ మీడియాలో ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.