మెగా ఫ్యామిలీకి సంబంధించిన అంజనా ప్రొడక్షన్ చిరంజీవి , ఆయన తన పెద్ద తమ్ముడు నాగబాబు తో స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో చిరంజీవి యాక్ట్ చేసిన రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, స్టాలిన్ వంటి సినిమాలతో సక్సెస్ ను ఇవ్వలేకపోయారు చిరు. ఇక బావ గారు బాగున్నారు సినిమా తప్పా అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో మరో హిట్ సినిమా నిర్మించలేక పోయారు. ఇక అంతేకాదు నాగబాబు నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఇదే బ్యానర్ పై హిట్ అవ్వలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో నిర్మించిన గుడుంబా శంకర్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఆ తర్వాత తీసిన రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ కూడా ఈ రకంగా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఇక నాగ బాబు హీరోగా కౌరవుడు అనే సినిమా నిర్మించిన అది కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఆ తర్వాత చిరంజీవి రీసెంట్ గా నటించిన సినిమా "సైరా నరసింహారెడ్డి". ఈ సినిమాని పలు భాషల్లో రిలీజ్ చేసి పర్వాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా 3 వ సినిమాతో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్. కొణిదెల ఫ్యామిలీ లో ఎవరికి కలిసిరాని ప్రొడక్షన్ హౌజ్ రామ్ చరణ్ కి మాత్రమే బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.