వివేక్ ఓబెరాయ్, అరుణ్ విజయ్, రవి కిషన్, ఎస్.జె.సూర్య,అరవిందస్వామి, దేవ్ గిల్, రాహుల్ దేవ్ వంటి విలన్ లు భయంకరమైన విలనిజం చూపిస్తూ, ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తూ, ఒక్కసారిగా ప్రేక్షకులను భయపెట్టినా, అవకాశాలను మాత్రం అందుకోలేకపోయారు. ఇందుకు కారణం ఎప్పటికప్పుడు కొత్త విలన్ లను పరిచయం చేయాలనే ట్రెండ్ కారణమని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో వస్తున్న విలన్ లు ఒకటి రెండు సినిమాలకు మించి కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం హీరోలు కూడా విలన్ పాత్రలు చేస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రకాష్ రాజు, జగపతి బాబు, రావు రమేష్ వంటి వారితో పాటు ఇప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ప్రేక్షకుల ముందుకు అఖండ మూవీ ద్వారా విలన్ గా రాబోతున్నాడు. ఇక శ్రీకాంత్ అయినా ఎన్ని రోజులు విలన్ గా కొనసాగుతారో లేదో చూడాలి మరి.