ఏకంగా 6 సంవత్సరాలుగా క్లీన్ హిట్ కి దూరమైన హీరోతో , బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ మూవీ ని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు . ఇక బాలీవుడ్ లో రెండేళ్ల క్రితమే రిలీజ్ అయిన ఆయుష్మాన్ ఖురానా నటించిన " డ్రీమ్ గర్ల్ " సినిమా సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపుగా రూ.140 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమానే, తెలుగులో రీమేక్ చేయబోతున్నారు హీరో రాజ్ తరుణ్.