నిర్మాతలందరూ స్టార్ హీరోలకు రెమ్యూనరేషన్ తగ్గించాలని భావిస్తున్నారు. ఇలా తగ్గించడానికి గల కారణం ఏమంటే, కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభించడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. అంతేకాకుండా లాక్డౌన్ ఆంక్షలను పాటించడం కోసం షూటింగులు కూడా ఆగిపోయాయి. ఇక ఫలితంగా నిర్మాతలు బాగా నష్టపోతున్నారు. ఇక అందుకోసమే నిర్మాతలందరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒకవేళ ఇదే పరిస్థితి భవిష్యత్తులో కూడా జరిగినట్లయితే భవిష్యత్తు ఇంకా కష్టమే అవుతుంది. కాబట్టి అందుకే స్టార్ హీరోలకు సైతం రెమ్యూనరేషన్ తగ్గించాలని చూస్తున్నారు నిర్మాతలు. ఒకవేళ ఇదే కనుక జరిగినట్లయితే స్టార్ హీరోలకు నిర్మాతలు దిమ్మతిరిగే దెబ్బకొట్టిన అవుతుంది. అంతేకాకుండా గొంతులో వెలక్కాయ పడినట్లవుతుంది అని అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్లు.