ఈనెల 20 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించబడింది. అంతేకాకుండా ఒకే రోజులోనే దాదాపుగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి రాష్ట్ర వైద్య శాఖ సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలిసిన చిరంజీవి, సీఎం జగన్ పనితీరును మెచ్చుకుంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ముఖ్యంగా వైద్య సిబ్బంది వల్ల ప్రతి ఒక్కరు కరోనా ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారిని ప్రోత్సహిస్తున్న సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు చిరంజీవి. ఇక చిరంజీవి ట్వీట్ కు సీఎం స్పందిస్తూ.. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలిపారు.