తెలుగులో ఋష్యేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా తొలిముద్దు. ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా, దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో.. దివ్యభారతి అనుకోకుండా 1993 ఏప్రిల్ 5వ తేదీన ప్రమాదవశాత్తు , తాగిన మత్తులో తెలియకుండానే తాను నివసిస్తున్న ఐదు అంతస్థుల బిల్డింగ్ పై నుంచి కిందపడి, తలకు పెద్ద గాయం తగిలి మరణించింది. అయితే తొలిముద్దు సినిమా షూటింగ్ సగం వరకే నటించింది. ఇక మిగతా సగం పూర్తి చేయడం కోసం ఆమె డూప్ గా గ్లామర్ క్వీన్ రంభ నటించారు.