సింగర్ కల్పన.. బాలకృష్ణ హీరోగా " సీతారామ కళ్యాణం" చిత్రంలో "రాళ్ళల్లో ఇసకల్లో" అనే పాటలో కనిపిస్తుంది కల్పన. అప్పుడు తన వయసు మూడు సంవత్సరాలు మాత్రమే. అలా మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సినీ ఇండస్ట్రీలోకి బాలనటిగా అరంగేట్రం చేసింది. అలా దాదాపుగా 30 సినిమాలలో బాల నటిగా నటించి రికార్డు సృష్టించింది. ఆరు సంవత్సరాల వయస్సులో గాయనిగా మారింది. ఆ తరువాత విఠలాచార్య దర్శకత్వం వహించిన "కామాక్షి కటాక్షం" సినిమాలో నటించింది. ఇక తర్వాత దేశంలోనే రెండవ త్రీడీ చిత్రంగా పేరుపొందిన "తంగమామ"అనే చిత్రంలో కీలక పాత్ర పోషించింది.