క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా , ఇలియానా హీరోయిన్ గా 2006 ఏప్రిల్ 20న రిలీజ్ అయిన చిత్రం పోకిరి. ఈ చిత్రం ఎంతో విజయం సాధించి మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పింది. ఈ చిత్రంలోని పాటలను మణి శర్మ అందించారు. ఇక అంతే కాకుండా 200 సెంటర్లలో 100 రోజులు ఆడి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా విడుదలైనప్పుడు, బాలకృష్ణ వీరభద్ర, ప్రభాస్ పౌర్ణమి, పవన్ కళ్యాణ్ బంగారం, అల్లరి నరేష్ కితకితలు వంటి సినిమాలు విడుదల అయినప్పటికీ పోకిరి సినిమా ముందు నిలవలేకపోయాయి.