త్రినాథరావు నక్కిన స్టార్ హీరోలు తనను పక్కన పెట్టారు అన్నమాట పై స్పందిస్తూ..రవితేజతో సినిమా త్వరలోనే ఉంటుందని, దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమైందని తెలిపారు. అంతేకాకుండా షూటింగ్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో, కరోనా రావడంతో కొద్దిగా ఆగాల్సి వచ్చింది అని, ఇక రవితేజ ఎప్పుడు ఓకే అంటే అప్పుడే సినిమా సెట్స్ పైకి వెళుతుందని ఆయన తెలిపారు. అంతే కాదు రవితేజతో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక వెంకటేష్ సినిమాకు సంబంధించి కథ కూడా మొత్తం పూర్తయింది. కాకపోతే క్లైమాక్స్ విషయంలో ఇంకా కొన్ని చర్చలు జరుగుతున్నాయి .ఈ లోపు వెంకటేష్ నారప్ప సినిమా లో బిజీగా ఉన్నట్లు, ఈ సినిమా అయిపోగానే నా దర్శకత్వంలో పని చేస్తారు అని ఆయన తెలిపారు.