అలనాటి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి తమ్ముడు విషయానికి వస్తే , తన రెండవ తమ్ముడైన నందు శృంగార భరితమైన చిత్రాలలో నటించడం గమనార్హం . తులసి దాసు దర్శకత్వంలో 1989వ సంవత్సరంలో ఆర్.బి.చౌదరి నిర్మించిన లయనం అనే చిత్రం మలయాళంలో, ఒక శృంగార భరితమైన చిత్రంగా విడుదలైంది ఇందులో నందు నటించినప్పుడు 17 సంవత్సరాలే ఉండడంతో తన అక్కలు ముగ్గురూ ఇలాంటి చిత్రాల్లో ఎందుకు నటించావు అంటూ నిలదీశారు. ఆ సినిమా దాదాపు పది సంవత్సరాల తర్వాత విడుదలైనప్పటికీ మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. అంతేకాదు ఈ చిత్రాన్ని తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. నందు 26 సంవత్సరాల వయసులో మరణించాడు.