ఒకరు  విలక్షణ నటుడు, మరొకరు సూపర్ స్టార్. ఇద్దరూ మంచి మిత్రులు. ఇద్దరికీ ఒకరే గాడ్ ఫాదర్ ఇద్దరూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగినవారే ఆ స్నేహితుల ఇద్దరి కుమార్తెలు సినిమా రంగంలో తమ సత్తాను చాటుతున్నారు. వారే తమిళ తెలుగు  సూపర్ స్టార్స్ రజనీకాంత్  కమల్ హాసన్ లు వారిద్దరూ ప్రస్తుతం కలిసి నటించకపోయినా ఒకరు నటించిన సినిమాలు మరొకరు ఆ సినిమా పూర్తి అయ్యాక చూసి ఒకరికి ఒకరు మార్పులు చేర్పులు చెప్పుకుంటారట. ఆ మధ్య కమల్ విశ్వరూపం సినిమాను రజనీ కోసం ప్రీమియర్ షో వేయించాడు కమల్. సినిమాను చూసిన రజనీ కమల్  అభినయాన్ని దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. ఆ తర్వాత సినిమా విడుదల ఆగిపోగా రజనీ కూడా తీవ్రంగా చలించాడు. అంతేకాదు ఆస్తులను తాకట్టు పెట్టి మరీ రిస్క్ చేయడం మంచి పద్దతి కాదని, కమల్ కు హితభోద చేసి  కొంత ఆస్తిని కూతుళ్ళ పేరు మీద కూడా రాయించేసాడు.

 

ఇక ఇప్పుడు రజనీ వంతు వచ్చింది, తీవ్ర అనారోగ్యం తరువాత తేరుకుని వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించిన  తన తాజా చిత్రం 'కొచ్చాడియాన్'ను చూసి సలహాలు చెప్పవలసిందిగా రజని కమల్ ను కోరాడట. సినిమాల నిర్మాణానికి సంబంధించి అన్ని విషయాలలోనూ అవగాహన ఉన్న కమల్ జడ్జిమెంట్ విషయంలో రజనీకి కమల్ పై పూర్తి నమ్మకం, అంతేకాకుండా రజనీ కుమార్తె దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా విజయం అటు రజనీ కే కాకుండా అతడి కుమార్తెకు కూడా ప్రతిష్టాత్మకంగా మారడంతో కమల్ ఈసినిమాను చూసి మార్పులు  చేర్పులు చెప్పేదాకా ఈ సినిమా రిలీజ్ డేటును ప్రకటించనని రజనీ అంటున్నాడట. రజనీ ఏమి అడిగినా నో అని చెప్పడం అలవాటు లేని కమల్ ఈ సినిమాను త్వరలోనే చూసి తన మిత్రుడికి సలహాలు ఇస్తాడని  వీరిద్దరుకు  వీలయ్యే సమయాన్ని ఎంచుకుని ఈ సినిమా ప్రీమియర్ షో ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. వీరిద్దరి గాడ్ ఫాదర్ బాలచందర్ దర్శకత్వంలో ఒక సినిమా మళ్ళీ చేయాలన్న కమల్ కోరిక ఈ సినిమా విడుదల తరువాత అయినా కమల్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.....

 

మరింత సమాచారం తెలుసుకోండి: