తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన చిత్రం ‘బాహుబలి’.  రెండు సంవత్సరాలు సుధీర్గంగా కష్టపడి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా భారత దేశంలో తెలుగు ఇండస్ట్రీ స్టామినా ఏంటో నిరూపించింది.  అంతే కాదు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కైవసం కూడా చెసుకుంది. ఇక ఈ సినిమాతో నటీ,నటులకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.  అయితే ఏ సినిమాలో అయినా హీరో కొన్ని రిస్క్యూ షార్ట్స్ ఉంటాయి.  ముఖ్యంగా కొన్ని ఫైట్ సీన్లలో వారికి డూప్ పెట్టాల్సి వస్తుంది.  
Image result for prabhas with kiran raj
‘బాహుబలి-2’లో ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయనే వార్తలు వినవస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫ్యూజువల్ వండర్ గా తెరకెక్కిన ‘బాహబలి’ పార్ట్ 1, 2 లో హీరో ప్రభాస్ కి కొన్ని కీలకమైన యుద్ద సమయంలో కూడా డూప్ వాడారట.  ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో ప్రభాస్ కు రిస్కీ ఫైట్స్ చేసేందుకు ప్రభాస్ కు డూప్ గా కిరణ్ రాజు అనే వ్యక్తి నటించినట్టు తెలుస్తోంది. కిరణ్ రాజు ఎత్తు, పర్సనాలిటీ, హెయిర్ స్టైల్ అచ్చు గుద్దినట్టుగా ప్రభాస్ లా ఉండటం గమనార్హం. సెట్స్ లో కిరణ్ రాజు తో ప్రభాస్ ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: