నాగ చైతన్య - సమంత ల పెళ్లి కబుర్లే ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుని వారం అవుతున్నా ఇప్పుడు జనాలకి వీరి హనీమూన్ ల గురించి గంపెడు ఆశలు ప్రశ్నలు పుడుతున్నాయి.

రాజు గారి గది 2 సినిమా ప్రమోషన్ లలో బిజీ గా ఉన్న హీరోయిన్ సమంత ఇంకెప్పుడు హనీమూన్ చేసుకుంటుంది అంటున్నారు చాలా మంది. వారిద్దరి హనీమూన్ స్పాటేక్కడ .. ఫారిన్ ప్లాన్స్ ఏంటి అంటూ సోషల్ మీడియా లో ఆనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అయితే వీటన్నిటికీ అన్సార్ ఇచ్చేసింది సమంత . ”ప్ర‌స్త‌తుం హ‌నీమూన్ ప్లాన్స్ ఏం లేవు. నేనూ – చైతూ ఆ దిశ‌గా ఇంకా ఆలోచించ‌లేదు” అని క్లారిటీ ఇచ్చేసింది. హ‌నీమూన్ కంటే చేయాల్సిన సినిమాలే ముఖ్యం అని తేల్చింది స‌మంత‌. ”షూటింగుల‌కు కొన్ని రోజుల నుంచీ దూరంగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు సెట్లోకి వెళ్తామా అంటూ ఆస‌క్తి గా ఎదురుచూస్తున్నా.

ఆదివారం నుంచి ‘సావిత్రి’ షూటింగ్ లో పాల్గొంటాను. ఆ తరవాత రెండు వారాలు కూడా సినిమాల కోసమే స్పెండ్ చెయ్యబోతున్నాను. నేనే కాదు మా ఆయన నాగ చైతన్య కూడా అంతే " అన్ని సమంత మీడియా తో చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: