కింగ్ నాగార్జున నిర్మాణంలో విక్రం కుమార్ డైరక్షన్ లో నాని రెండో సినిమా వస్తున్న హలోపై సాధ్యమైంత వరకు హైప్ క్రియేట్ అయ్యేలా చేశాడు నాగార్జున. మొదటి సినిమా ఫ్లాప్ ఛాయలేమి ఈ మూవీపై పడకుండా ఫ్రెష్ గా కనిపించేలా చేశాడు. విక్రం కుమార్ తీసిన సినిమాను రెండు ముక్కల్లో ఇది కథా అని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు నాగార్జున.


డిసెంబర్ 22న రిలీజ్ అవబోతున్న అఖిల్ హలో సినిమా ప్రమోషన్స్ లో నాగార్జున సినిమా కథ రివీల్ చేశాడు. చిన్నప్పుడు ప్రేమించుకున్న ఓ జంట విడిపోయేప్పుడు తన ఫోన్ నెంబర్ ఆ కుర్రాడికి ఇచ్చి వెళ్తుందని.. ఆ నెంబర్ 15 ఏళ్లుగా ట్రై చేసి ఫైనల్ గా హీరోయిన్ ను కలుస్తాడట. కథ కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది.


ఇందులో లవ్, ఎమోషనల్ సీన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూనే స్టంట్స్ హాలీవుడ్ సినిమా అప్పీల్ ఏర్పరిచారు. ముఖ్యంగా ట్రైలర్ లో అఖిల్ చేసిన విన్యాసాలు అన్ని ఇన్ని కావు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తుంది. నాగార్జున అన్నపూర్ణ ప్రొడక్షన్ లో 40 కోట్ల దాకా ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది.


మరి కథ చెప్పి అంచనాలను పెంచేసిన నాగ్ సినిమాను కొన్ని ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేస్తున్నాడు. పక్కాగా చెప్పాలంటే నాగార్జున హలోపై భారీ నమ్మకాన్నే పెట్టుకున్నాడని తెలుస్తుంది. సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అయితే అఖిల్ కు స్టార్ క్రేజ్ దక్కినట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: