కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని ఇండస్ట్రీల్లో పాతుకుపోయింది. ఇప్పటికే ఎంతోమంది స్టార్
హీరోయిన్స్ మీటూ ఉద్యమం తో తాము కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని చెప్పి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని మాత్రం నటి
శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ తో
టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించింది . అప్పట్లో ఎంతో మంది గుట్టు రట్టు చేస్తాను అంటూ సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి. ఇక
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ని మొత్తం కూకటివేళ్ళతో పెకలించి వేస్తాం అంటూ ఎంతో మంది చెప్పినప్పటికీ అది మాత్రం సాధ్యం కాలేదు. అయితే
శ్రీ రెడ్డి లాంటి నటులు కాస్టింగ్ కౌచ్ నిర్మూలించేందుకు ఎన్నో ఉద్యమాలు కూడా చేపట్టారు. అయితే కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎంతమంది
సినిమా అవకాశాలు ఇస్తామంటూ వాడుకుని వదిలేసినా వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో
హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
దర్శక నిర్మాతల పడకగదికి వెళ్లిన తర్వాతే
సినిమా అవకాశాలు వస్తాయని లేకపోతే
సినిమా అవకాశాలు రావని... పడక గదికీ వెళ్లకపోతే దర్శకనిర్మాతలకు తమ టాలెంట్ కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవిలత. అప్పట్లో నచ్చావులే సినిమాలో నటించిన ఈ అమ్మడు నానితో స్నేహితుడు అనే సినిమాలో కూడా నటించింది. అయితే మాధవీలత
తెలుగమ్మాయి కావడంతో పెద్దగా అవకాశాలు కూడా రాలేదు . ఇక ఆ తర్వాత సినిమాల్లో
మాధవి లత కనుమరుగయిపోయింది . తాజాగా ఎన్నికల్లో
బీజేపీ నుంచి కూడా పోటీ చేసింది ఈమే. కాగా తాజాగా
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో కమిట్మెంట్ అనేది చాలా పవిత్రమైన పదం అని తెలిపింది
మాధవి లత. కానీ ప్రస్తుతం కమిట్మెంట్ అనే పదాన్ని మనవాళ్లు చండాలం చేశారంటూ చెబుతోంది. ఇప్పుడు
సినిమా ఇండస్ట్రీలో కమిట్ మెంట్ అంటే పడకోవడం అనే అర్థానికి దిగజార్చారు అంటూ చెబుతోంది మాధవీలత.
మామూలుగా అయితే కమిట్మెంట్ అనే పేరుకు అర్థం ఒప్పుకున్న సినిమాని సజావుగా పూర్తి చేయడం కానీ ఇప్పుడు మాత్రం కమిట్మెంట్ అంటే అది పడుకోడానికి వస్తావా అన్నట్లుగా మార్చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకి కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని ఈ అమ్మడు చెబుతుంది . అప్పట్లో కొంతమంది దర్శక నిర్మాతలు తనను కూడా కమిట్ మెంట్ అడిగారు అని సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవిలత. తాను దర్శక నిర్మాతల ఆలోచన అర్థం చేసుకుంది వాళ్ళు అడిగిన కమిట్మెంట్ కు నో చెప్పినట్లు తెలిపింది . ఇప్పటికే
సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో మాధవిలత వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. పడక గదికి వస్తే కానీ హీరోయిన్లకు అవకాశాలు రావు అని
మాధవి వ్యాఖ్యలు సంచలనంగా మారింది.