పెళ్లిచూపులు సినిమాతో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో విజయ్ కు ఏ రేంజ్ లో యూత్ ఫాలోయింగ్ ఏర్పడిందో అందరికి తెలిసిందే. తనకు వచ్చిన ఈ క్రేజ్ ను కాపాడుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత టాక్సీవాలా హిట్ కొట్టాడు. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినా విజయ్ కు మంచి పేరే వచ్చింది.

 

ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మొన్నామధ్య ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేసిన విజయ్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసి మరింత షాక్ ఇచ్చాడు.

 

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున రిలీజ్ చేస్తున్నారట. ఇదో రకంగా విజయ్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే వార్తే. అయితే సినిమాలో విజయ్ లవ్ ఫెయిల్యూర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా ముగ్గురితో విజయ్ లవ్ ఫెయిల్ అవుతుందట్. ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ మొదటి హీరోయిన్ గా నటిస్తుందట. రాశి ఖన్నా కూడా సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది.

 

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డియర్ కామ్రేడ్ తో మిస్సైన హిట్ టార్గెట్ ఈ సినిమాతో ఫుల్ ఫిల్ చేయాలని చూస్తున్నాడు మన రౌడీ హీరో. సినిమా పక్కా హిట్ కొట్టేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తుంది. సినిమా ప్రమోషన్స్ కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి నుండే ఈ సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెడతారని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: