తెలుగు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం మన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ పరిస్థితి కొంచెం అటు ఇటు అలానే ఉంది. ఈమె నటించిన సినిమాలు హిట్ అవ్వవో లేక హిట్ అవ్వని సినిమాలు అన్నీ ఈమె ఏరికోరి ఎన్నుకుంటుందో తెలీదు. అసలే తెలుగు అమ్మాయి కావడంతో ఆమెకు అవకాశాలిచే వాళ్లు కూడా కరువయ్యారు. ఇంతకుముందు తరంలో తెలుగు హీరోయిన్లు ఎక్సపోసింగ్ చేయము అని కూర్చునే వారు కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 

 

కానీ ఇప్పుడు అవసరాన్ని బట్టి తెలుగు హీరోయిన్లు కూడా గ్లామరస్ గా కనిపించడానికి సై అంటున్నారు. ఈషా రెబ్బ ఈ లిస్ట్ లో చాల స్పీడ్ గా ఉంటుంది. మొదటి సినిమాల్లో పద్దతిగానే కనిపించిన ఈషా రాను రాను ఎక్సపోసింగ్ మొదలుపెట్టింది. గ్లామరస్ గా కనిపించడానికి సై అంటోంది. తనని హాట్ హీరోయిన్ అంటేనే అనందంగా ఉంటుంది అని చెప్పారు. ఇంత బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా కానీ ఈషాకు వచ్చే అవకాశాలు రావటం లేదు అనే చెప్పాలి.

 

ఎన్టీఆర్ సరసన అరవింద సమేత చిత్రంలో ఆమె నటించిన వచ్చిన ఉపయోగం ఏం లేదు. పెద్ద సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారని చిన్న సినిమాల వైపు తన దృష్టి పెడితే అవి మరీ దారుణంగా దెబ్బేస్తున్నాయి. రీసెంట్ గా ఈషా నటించిన రాగల 24 గంటల్లో సినిమాతో భారీ ప్లాప్ అందుకుంది ఈషా. ఇందులో ఆమెకు నటనకు ప్రాధాన్యమున్న పాత్రే దక్కింది. అలాగే గ్లామరస్ గానూ కనిపించింది ఈషా. అయినా సినిమా ప్లాప్ కావడంతో ఈషా కెరీర్ అసలు కదలడం లేదు.

 

గతంలో ఆమె చేసిన సుబ్రమణ్యపురం, బ్రాండ్ బాబు సినిమాలు కూడా అస్సలు ఆడలేదు. అసలే అవకాశాలు అంతంతమాత్రంగా వస్తున్న సమయంలో ఇలా ఆమె నటించిన అరాకొరా సినిమాలు కూడా ప్లాప్ అవుతుంటే ఇక అవకాశాలు ఇచ్చేదేవరు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: