గత కొన్నేళ్లుగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో, ఇప్పటికీ కూడా ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆదరణ తగ్గకుండా ముందుకు సాగుతుంది అనే చెప్పాలి. ఇక ఇటీవల ఆ ష కు జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు అర్ధాంతరంగా షో నుండి వెళ్లిపోవడం, అలానే ఆయనతో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి వారు కూడా వెళ్లిపోయారు. అయినప్పటికీ షోలో ఏ మాత్రం జోష్ తగ్గకుండా హైపర్ ఆది, అనసూయ సహా మిగతా పార్టిసిపెంట్స్ అందరితోనూ మరింత రసవత్తరంగా స్కిట్స్ చేయిస్తోంది జబర్దస్త్ యూనిట్. ఇక రాబోయే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ వీడియో ప్రోమోని నిన్న ఉదయం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇక సుడిగాలి సుధీర్ తన స్కిట్ లో భాగంగా మాట్లాడుతూ, అరేయ్ అవతల రష్మీకి పెళ్లి చూపులు జరుగుతోంది, 

 

వాటిని ఎలా ఆపాలో చెప్పండి రా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా, ram PRASAD' target='_blank' title='ఆటో రామ్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను అతని ఏడుపు ఆపడానికి ప్రయత్నిస్తారు. ఎలాగైనా ఆ పెళ్లిచూపులు ఆపాలని వారిద్దరికీ సుధీర్ చెప్తాడు, అయితే ఆ మాటకు జడ్జి రోజా రియాక్ట్ అవుతూ, రష్మీకి పెళ్లి అయిపోతే తనను ఎవరూ పట్టించుకోరని సుధీర్ కు భయం అని అనగానే షో మొత్తం నవ్వులు పూస్తుంది.  రష్మీకి పెళ్లి అయితే వీడి పరిస్థితి ఏంటిరా అని గెటప్ శ్రీను అడగగానే, ఏముంది మళ్ళి పాత పద్దతిలో మనోడు మ్యాజిక్కులు చేసుకుంటూ బ్రతకడమే అని అంటాడు రామ్ ప్రసాద్, ఆ సరదా సీన్ కి షోలో ఒకటే ఈలలు గోలలుతో మారు మ్రోగుతుంది. 

 

ఇక ఆ తరువాత ఆమెను పెళ్లి చూపులు చూడడానికి వచ్చేది బిత్తిరి సత్తి, రూలర్ లో బాలయ్య అడుగడుగో సాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన సత్తి, ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి చేసినట్లుగా, మీరు కూడా మా పెళ్లి చూపులకు ఈ హడావుడి చేస్తున్నారా అని అడుగుతాడు. ఇక ఈ సన్నివేశం మొత్తం, ప్రోమోలో ఎంతో అద్భుతంగా ఉంది. ఇక ఈ ప్రోమోని బట్టి చూస్తుంటే త్వరలో ప్రసారం కాబోయే ఆ ఎపిసోడ్ మరింత సరదాగా సాగనుందని అర్ధం అవుతుంది. కాగా ఆ వీడియో ప్రోమో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: