లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్, చిన్నతనంలోనే తమిళ్ లో కొన్ని సినిమాల్లో అక్కడక్కడ కొన్ని పాత్రల్లో నటించి మంచి పేరు దక్కించుకుంది. ఇక ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక తెలుగు, తమిళ్, హిందీ వంటి పలు భాషల్లో ఎన్నో మంచి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు దక్కించుకుంది. ముందుగా తెలుగులో సిద్ధార్థ హీరోగా కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన శృతిహాసన్, ఆ తర్వాత గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, రామయ్య వస్తావయ్య, బలుపు వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తన అందచందాలతో అలానే అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించింది. 

 

అయితే మొదటి నుంచి కూడా తండ్రి కమల్ వలె స్వతంత్ర వ్యక్తిగత భావాలు గల శృతిహాసన్, ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. అయితే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె కొద్దిరోజుల పాటు ప్రేమాయణం నడిపిందని, కానీ ఆ తర్వాత వారి మధ్య కొంత వివాదాలు చెలరేగి బ్రేకప్ కూడా జరిగిందని ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం పక్కనపెడితే, కొన్నాళ్ల క్రితం తన పెళ్లి గురించి ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన శృతిహాసన్, నిజానికి తనకు పెళ్లిపై అంత గొప్ప సదాభిప్రాయం ఏమీ లేదని, అయితే తాను బిడ్డలకు తల్లి కావాలని అనుకుంటున్నాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని శృతి చెప్పడం జరిగింది. 

 

కాగా శృతిహాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక కొంత ఆవేదన దాగి ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆమె తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక ఇద్దరూ కూడా పెళ్లి తర్వాత కొన్నాళ్ళకు విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కమల్, గౌతమితో కలిసి కొద్దిరోజుల పాటు సహజీవనం కూడా చేశారు. అయితే తన తల్లిదండ్రుల జీవితం అలా కావడంపై చిన్నప్పటి నుంచి కొంత ఆవేదనకు గురైన శృతి కి, పెళ్లి పై మొదటినుంచి సదభిప్రాయం ఉండి ఉండకపోవచ్చని, అందుకనే ఆవిడ ఈ విధంగా సమాధానం చెప్పి ఉండొచ్చుని అంటున్నారు. అయితే ఆమె వ్యాఖ్యల పై ఇదెక్కడి విడ్డూరం శృతి అని అక్కడక్కడా కొందరు అంటున్నప్పటికీ, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, ఒక స్త్రీగా తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా మలుచుకుని జీవించే అధికారం ఆమెకు ఉందని పలువురు ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: