ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం ఈ సినిమాపై  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా గురించి ఏ చిన్న లీక్ విడుదలైన అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. అయితే ఇప్పుడు వరకు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది  చిత్ర బృందం. కానీ ఆర్ఆర్ఆర్  సినిమాలో  రామ్ చరణ్ పాత్రకు సంబంధించి ఏ చిన్న లీక్ కూడా బయటకు రాలేదు. ఇక ఎంతోమంది అభిమానులు రామ్ చరణ్ పాత్రకు సంబంధించి అప్డేట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుందో అని నిరీక్షణ గా చూస్తున్నారు అభిమానులు. 

 


 అయితే కొంతమంది అభిమానులు మెగా పవర్ స్టార్ న్యూ లుక్ కోసం ఎదురుచూస్తుంటే ఇంకొంత మంది అభిమానులు... తమ అభిమాన హీరో  రామ్ చరణ్ లుక్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో  అనే విషయాన్ని ఫొటోషాప్ ద్వారా ఎడిట్  చేస్తూ అందరికీ ఆశ్చర్యానికి గురీ చేస్తున్నారు . ఓ అభిమాని ఎడిట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక్కడ అభిమాని తన అభిమాన హీరో రామ్ చరణ్ ను ఏ విధంగా అయితే చూడాలి అనుకుంటున్నాడో ... అది  ఫోటోషాప్ చేసి ఎడిట్ చేసి కండలు తిరిగిన రామ్ చరణ్ ని తయారు చేసాడు ఓ అభిమాని. ఈ లుక్ లో ఒక సినిమా రావాలి... వస్తే బాక్సాఫీస్ షేక్ అవడం పక్కా అంటూ పోస్ట్ పెట్టాడు. 

 


 అయితే ఈ పోస్టులో కేవలం రామ్ చరణ్ తేజ్ తప్ప మిగతాదంతా వేరొకరి బాడీ. అదంతా ఒరిజినల్ కాదు. కానీ రామ్ చరణ్ తేజ్ కి ఏమైతే మ్యాచ్ అవుతుందా అని తీసుకుని ఒక సూపర్ పిక్చర్ ని తయారు చేసాడు అభిమాని. కండలు తిరిగిన దేహంతో... అమ్మాయిల అందరికీ పిచ్చెక్కించేలా... పసుపు రంగు లుంగీలో... అదిరిపోయే లుక్ తో కనిపిస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఒక్కసారిగా చూసిన వాళ్ళు అందరూ ఈ సినిమా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా లోని లుక్ అనుకుంటున్నారు. ఏదేమైనా అభిమాని ఎడిట్ చేసిన పిక్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తున్న చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: