ఇప్పటి వరకు అందంగా తెరపై అద్భుతంగా యూత్ డ్రీమ్ గర్ల్ గా కనిపించిన సమంతకు ఒక విచిత్రమైన కోరిక కలిగిందట. ఎవరైనా తనను వెండి తెరపై అంద విహీనంగా డీగ్లామర్ రోల్ లో చూపెడితే ఆ దర్శక నిర్మాతలకు తాను వారు తీయబోయే సినిమాలో ఫ్రీగా చేస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించింది సమంత. “ఇప్పటి వరకూ కమర్షియల్ సినిమాలే చేశా. పాటలూ, డాన్స్‌లకే పరిమితం కావడం నాకిష్టం లేదు అందుకే డార్క్ షేడ్ ఉన్న పాత్ర చేయాలని ఉంది”... అని ఫేస్‌బుక్‌లో తన అభిమానులకు చెప్పింది
సమంత త్వరలో కన్నడ చిత్రం చేయబోతోంది. అది ఈ తరహా పాత్రేనట. అయితే తెలుగులతో, భారీ మార్కెట్ సమంతచేత అటువంటి ప్రయోగం చేసే దర్శకులు ఉన్నారా అన్నదే ప్రశ్న. ఈలోపు మన మాయలేడికి మరో కోరిక కలిగిందట. పెళ్లి ఎప్పుడు అన్నది తెలియని సమంతా తన హనీమూన్ స్పాట్ ను కూడ తన ట్విటర్ లో తన అభిమానులకు తెలియచేసింది. ఇంకా పెళ్ళే కాని సమంతకు అప్పుడే హనీమూనా అని అనుకోకండి.
సమంత తన హనీమూన్ ను ప్యారిస్ లో చేసుకోవాలని అనుకుంటోoదట. ట్విట్టర్లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమంత.. తన హనీమూన్ ప్యారిస్ లో ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే అది ఎవరితో అన్నది మాత్రం సస్పెన్స్ అని అంటోంది..
ఈ మధ్య కోలీవుడ్ నిర్మాతల చేత పెళ్ళి విషయంలో అస్తమాను హడావిడి చేస్తే 15 కోట్ల జరిమానా అని బెదిరింపులు కూడా తెచ్చుకున్న సమంత మళ్ళీ యూటర్న్ తీసుకుని హనీమూన్ అని చెప్పడం ఏమిటో సమంతకే తెలియాలి..
మరింత సమాచారం తెలుసుకోండి: