మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి చిత్రం పేరు ప్రాణం ఖరీదు. కే. వాసు వైద్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సత్యనారాయణ రావు అందించారు. ఎన్నో అద్భుత చిత్రాలకు కథలు అందించిన సత్యనారాయణ రావు మంగళవారం నాడు హైదరాబాదులో తన తుది శ్వాస విడిచారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనితో ఆయన సహజ మరణం చెందారు. సత్యనారాయణ రావు చనిపోవడంతో తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు కడసారి చూపుకు నోచుకోలేని పరిస్థితి వచ్చి పడింది. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

 


ఇక బాధ పరిచే విషయం ఏమిటంటే... ఆయన పెద్ద కుమారుడు ప్రస్తుతం సింగపూర్ లో జీవిస్తున్నారు. కరోనా వైరస్ తో పెద్ద కుమారుడు ఇండియాకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బంధువులు శ్రేయోభిలాషులు ఎవరు ఆయన పరామర్శించడానికి రావద్దని లాక్ డౌన్ ని పాటించాలని కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు సత్యనారాయణ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈయనకు ప్రాణం ఖరీదు సినిమాతో పాటు ఊరుమ్మడి బతుకులు, మల్లెమొగ్గలు, నాయకుడు వినాయకుడు, తరం మారింది ఇలాంటి విభిన్న చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి.

 


ఎన్టీఆర్ నటించిన సరదారాముడు, సొమ్మొకడిది సోకొకడిది లాంటి చిత్రాల్లో సత్యనారాయణరావు కూడా నటించారు. ఈయన ఎన్నో నవలలని రచించారు. అలాగే నాటక రంగంలో ఆయన విశేషమైన సేవలు కూడా అందించారు. తెలుగులో చాలామంది నటీనటులకు నారాయణరావు శిక్షణ కూడా ఇచ్చారు. నిజంగా తండ్రి మరణించిన తర్వాత కూడా చూడలేని పరిస్థితులో కుమారుడు ఉండడం నిజంగా బాధ పరిచయ విషయమే. నిజానికి ఇలాంటి పరిస్థుతలలో కన్నా వారిని చూడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: