స్మాల్ స్క్రీన్ పై నవ్వుల జల్లులు కురిపించే జబర్దస్త్ షో గత ఐదారేళ్లుగా సక్సెస్ ఫుల్ రియాలిటీ షో గా రన్ అవుతుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ స్కిట్స్ తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు కంటెస్టెంట్స్. అయితే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఒక్కోదానిలో నాలుగు ఐదు టీంలు ఉంటాయి. వాటిలో నలుగురు ఐదుగురు కంటెస్టెంట్స్ అదే కమెడియన్స్ ఉంటారు. టీం లీడర్ అతనితో మరో కమెడియన్ మెయిన్ గా ఉంటారు. అయితే ఒక్కో టీం లో ముగ్గురు నలుగురు కూడా ఇంపార్టెంట్ కమెడియన్స్ ఉంటారని చెప్పొచ్చు. 

 

అయితే వీరు కాకుండా స్కిట్ లో ఇలా వచ్చి అలా వెళ్లే పాత్రల్లో కూడా కొందరు కనిపిస్తుంటారు. వాళ్ళు షోకి ఉపయోగమా కాదా అన్నది పక్కన పెడితే వాళ్లకు టీం లీడర్స్ ఎంతోకొంత పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జబర్దస్త్ లో ఒకసారి కనబడితే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరికి ఛాన్స్ ఇవ్వడం కుదరదు. ఇక ఇప్పుడు ఆ ఎక్స్ ట్రా టీం మెంబర్స్ ను కూడా తీసేసే ఆలోచనలో ఉన్నారట జబర్దస్త్ నిర్వాహకులు. 

 

ఈమధ్యనే జబర్దస్త్ లో హైపర్ ఆది టీం లో ఇద్దరు మెంబర్స్ ను తీసేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే వారితో పాటుగా మరో నలుగురు ఐదుగురికి జబర్దస్త్ నుండి తొలగించినట్టు తెలుస్తుంది. వాళ్ళ వల్ల షోకి ఎలాంటి ఉపయోగం లేదని తీసేస్తున్నారట. అంతేకాదు జబర్దస్ నుండి వెళ్లిన నాగబాబు అదిరింది షోని కూడా జబర్దస్త్ ధీటుగా రెడీ చేస్తున్నాడు. మొదట్లో కొద్దిగా బోర్ అనిపించినా జబర్దస్త్ కు అదిరింది ఆల్టర్నెట్ అయ్యేలా కనిపిస్తుంది. అందుకే ఎక్స్ ట్రా గా ఉన్న మెంబర్స్ ను తీసేసి స్కిట్స్ ఇంకా క్వాలిటీగా ఉండేలా టీం లీడర్స్ కు చెబుతున్నారట. మొత్తానికి జబర్దస్త్ లో కూడా ఏరివేత మొదలైందన్నమాట. ఇక్కడ ఎగ్జిట్ అయినా వాళ్లకు అక్కడ డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: