స్టార్ హీరో సినిమా వచ్చిందంటే మామూలుగానే ఆ సినిమాపై భారీ అంచనాలు పెరిగి పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి భారీ అంచనాలు పెంచేసినా ఆ సినిమా...అంతకుమించిన  భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇలా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటే కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయి డిజాస్టర్ గా నిలుస్తాయి. ఇలా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచిన సినిమా శక్తి. ఈ సినిమా మొదట్లో భారీ అంచనాలే కలుగజేసింది. అప్పుడు వరకు జూనియర్ ఎన్టీఆర్ కనిపించని సరికొత్త గెటప్ తో ఆలయ పాలకుడిగా ఈ సినిమాల్లో కనిపించడం ప్రేక్షకుల్లో మరింత హైప్  తీసుకొచ్చింది. 

 


 ఇలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ సినిమా స్టోరీ మాత్రం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది అని చెప్పాలి. కొన్ని సన్నివేశాలు శక్తి సినిమాలో కాస్త అతి అనిపిస్తూ ఉంటాయి  సినిమా చూస్తున్న ప్రేక్షకులకు. ఒక పిడికగుద్దు తో విలన్ ఏకంగా రైలును  సైతం ధ్వంసం చేయడం.. ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు అతి అనిపించాయి. ఇలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి డిజాస్టర్ గా నిలిచింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ బుల్లి తెరపై మాత్రం మంచి క్రేజ్ సంపాదించింది ఈ సినిమా. 

 


 బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఈ సినిమా వచ్చింది. సినిమా బుల్లితెరపై వచ్చిన అన్ని సార్లు మంచి రేటింగ్ ను సంపాదించుకుంది. బుల్లితెర ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. ఇలా ఈ సినిమా వెండితెరపై సత్తా చాట లేకపోయినప్పటికీ బుల్లితెరపై మాత్రం మంచి గుర్తింపు సంపాదించింది అని చెప్పాలి. ఇప్పటికి కూడా ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా సినిమా చూడడానికి సిద్ధమైపోతుంటారు .

మరింత సమాచారం తెలుసుకోండి: