మెగా సర్ ప్రైజ్ తో బిగ్గెస్ట్ ప్యాకేజీ రెడీ చేస్తున్నాడు కొరటాల శివ. ఆచార్య సినిమాతో ఆడియన్స్ కు లార్జ్ స్కేల్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని భారీగా స్టార్స్ ని దించుతున్నాడు. ఇప్పటికే తండ్రీ కొడుకులిద్దరినీ ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొస్తున్న కొరటాల ఇప్పుడు.. బాహుబలి స్టార్స్ ని తీసుకొస్తున్నాడు. ఆచార్య మూవీని మరింత భారీగా మారుస్తున్నాడు. 

 

ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను ఎక్స్ పీరియన్స్ చేయడానికి చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఇక ఈ అంచనాలను తర్వాతి లెవల్ కు తీసుకెళ్లడానికి స్టార్ వాల్యూ మరింత పెంచుతున్నాడు కొరటాల శివ. ఆచార్యకు సపోర్టింగ్ గా బాహుబలి స్టార్స్ ని దింపుతున్నాడట కొరటాల.  

 

ఆచార్య సినిమాలో భల్లాల దేవుడు ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. రానా ఓ సర్ ప్రైజింగ్ రోల్ చేస్తాడని టాక్ వస్తోంది. అలాగే బాహుబలి ది బిగినింగ్ కి గ్లామర్ కోటింగ్ ఇచ్చిన తమన్నా సైరాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని సమాచారం. మణిశర్మ కంపోజ్ చేసిన మాస్ మసాలా సాంగ్ లో తమన్నా గ్లామర్ డోస్ ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. ఇక సైరా సినిమాలో చిరుతో జోడీ కట్టింది తమన్నా. 

 

ఆచార్య సినిమా 40శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నాక.. లాక్ డౌన తో బ్రేకులు పడ్డాయి. షూటింగ్స్ కు పర్మీషన్ వచ్చినా కరోనా కేసులు పెరగడంతో సెట్స్ కు వెళ్లే ఆలోచనలను పోస్ట్ పోన్ చేశాడు ఆచార్య. ఇక ఈ సినిమాలో చిరుతో కాజల్ అగర్వాల్ జోడీ కడుతోంది. అయితే చరణ్ కు మాత్రం ఇంకా హీరోయిన్ సెట్ అవ్వలేదు. మొత్తానికి ఆచార్య సినిమా చిరంజీవి అభిమానులను ఆసక్తిరేకెత్తిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: