మెగాస్టార్ చిరంజీవి యంగ్ గా మారాడు.. అరవై ఏళ్ళు పైబడినా ఆయన ఇంకా యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు. మొన్నటివరకు ఏ చిన్న సినిమా ఫంక్షన్ నుండి పిలుపు వచ్చినా సరే అతిథిగా వచ్చి ఆశీర్వదించిన చిరు కరోనా టైంలో ఇంటికి పిలిచి మరి తన అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ వచ్చి ప్రేక్షకాదరణ పొందలేకపోయిన బ్లఫ్ మాస్టర్ సినిమాను ఇటీవల చూశారట చిరంజీవి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే తనకు నచ్చడంతో ఆ సినిమా దర్శకుడు గోపి గణేష్ ను ఇంటికి పిలిచి మరి ప్రశంసించారు చిరంజీవి.

 

ఇక ఈ మీటింగ్ లో చిరు లుక్ అందరిని సర్ ప్రైజ్ చేసింది. మీసం తీసి యంగ్ గా కనిపిస్తున్నాడు చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తాడని తెలుస్తుంది. ఇక మీసం లేకుండా కనిపించిన చిరు ఆచార్య కోసమే అలా తయారయ్యాడని అంటున్నారు.

 

తనయుడు రాం చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్లు కొడుతున్నా చిరు మాత్రం తన ఫాం ను ఏమాత్రం కోల్పోలేదు. 10 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఖైది నంబర్ 150తో సూపర్ హిట్ అందుకున్న చిరు ఆ తర్వాత సైరా నరసిం హా రెడ్డి సినిమాతో మెప్పించారు. ఆచార్య సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే చిరు ముందు చరణ్ కూడా తేలిపోవడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా చిరు, చరణ్ ఒకే సినిమాలో కనిపిస్తే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: