ఇదిలాఉంటే సీజన్ 4లో వచ్చిన 16 మంది కంటెస్టంట్స్ లో కొంతమంది మాత్రం ఓకే అనిపించేల ఉన్నా మరికొంతమంది మాత్రం అసలు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని ఫేస్ లను తెచ్చారు. ఈ సీజన్ లో 8,9 మంది టాప్ సెలబ్రిటీస్ ను ఉంచేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అందులో లవర్ బోయ్ తరుణ్ నుండి జబర్దస్త్ హైపర్ ఆది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. నందమూరి తారక రత్నని కూడా బిగ్ బాస్ కంటెస్టంట్ గా వచ్చేందుకు అడిగారట. ఆయన రానని చెప్పారట.
అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజి భార్య మధుమితని బిగ్ బాస్ కంటెస్టంట్ ఆఫర్ ఇచ్చారట. ఆమె కూడా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూడా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్ గా రావాల్సి ఉండగా తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిందట. ఇక జబర్దస్త్ కంటెస్టంట్స్ ఇద్దరు ముగ్గురిని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చినా సారీ చెప్పేశారట.
హైపర్ ఆదికి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినా బిగ్ బాస్ చేసేది లేదని తెగేసి చెప్పాడట. మొదటి సీజన్ నుండి జబర్దస్త్ లో కమెడియన్స్ ను తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సీజన్ లో ముక్కు అవినాష్ ఆ ఛాన్స్ అందుకున్నాడని టాక్. అయితే అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తాడని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి