బయట స్వాతి దీక్షిత్ తో మిగతా వాళ్లంతా పార్టీని ఎంజాయ్ చేస్తుంటే వీరిద్దరు మాత్రం సోఫాలో కూర్చుని మనం ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నాం అనుకుంటారు. ఇలానే ఉంటే మనకే బొక్క పడేలా ఉందని అంటాడు మెహబూబ్. మనం కేవలం టాస్కుల్లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాం కాని అదే కాకుండా ఎంటర్టైన్ కూడా చేయాలన్న ఆలోచన వారికి వచ్చింది.
ఈ సీజన్ లో మెహబూబ్, సోహైల్ కూడా టాస్కుల పరంగా బాగా బెస్ట్ ఇచ్చేస్తున్నారు. కాని ఎంటర్టైనింగ్ లోనే వాళ్ళు వీక్ అవుతున్నారు. అయినా అమ్మాయిలతో పులిహోర కలపడం ఓ టాలెంట్.. మరి సోహైల్, మెహబూబ్ కూడా తమ గేం ప్లాన్ మారుస్తారా.. ఇక మీదట వార్ కూడా అమ్మాయిలతో కలివిడిగా ఉంటారా అన్నది చూడాలి. ఇక బిగ్ బాస్ హౌజ్ మూడవ కెప్టెన్ గా గంగవ్వ ఎంపికయ్యారు. మొదటి కెప్టెన్ గా లాస్య, రెండవ వారం నోయెల్ ఇంటి కెప్టెన్ కాగా మూడవ కెప్టెన్ గా గంగవ్వ సెలెక్ట్ అయ్యింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి