బిగ్ బాస్ సీజన్ 4లో శనివారం ఎపిసోడ్ నాగార్జున జోష్ ఫుల్ యాంకరింగ్ తో హౌజ్ మేట్స్ తో సరదాగా గడిచింది. ఇక శనివారం ఎప్పటిలానే వారం మొత్తం జరిగిన టాస్కుల గురించి ప్రస్థావించిన నాగార్జున ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న ఏడుగురు ఇంటి సభ్యుల్లో ఒకరిని సేఫ్ చేశారు. ఆటలో భాగంగా ఇంటి సభ్యుల నెగటివ్స్ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి గురించి చెప్పమన్నారు నాగార్జున. ఈ టాస్కుతో అందరిని అలరించారు. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో లాస్యని సేఫ్ చేశారు నాగార్జున.  

ఇక మిగిలిన ఆరుగురిలో మోనాల్ ను సేవ్ చేశారు నాగ్. సో ఏడుగురిలో శనివారం లాస్య, మోనాల్ ఎలిమినేషన్ భారీ నుండి తప్పించుకున్నారు. ఇక మిగిలిన ఐదుగురిలో ఆదివారం ఒకరు హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతారు. మిగిలిన వారిలో కుమార్ సాయి, అరియానా, దేవి, మెహబూబ్, హారిక నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ ఐదుగురిలో హారిక, దేవి ఈజీగా సేవ్ అయ్యేట్టు కనబడుతుండగా మెహబూ, కుమార్ సాయిలు డేంజర్ జోన్ లో ఉంటారని తెలుస్తుని. అరియానికి కూడా బయట ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

మొత్తానికి ఈ వారం హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. హౌజ్ లో ఆటపాటలతో ఇంటి సభ్యులందరిని ఆడించారు నాగార్జున. మొత్తానికి శనివారం ఎపిసోడ్ ఆడియెన్స్ ను అలరించిందని చెప్పొచ్చు. మరి ఆదివారం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి.                                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: