బిగ్ బాస్ హౌజ్ లో ఆరవ వారంలో కెప్టెన్ గా నోయెల్ ఎంపికయ్యాడు. అయితే ఈ సీజన్ లో హౌజ్ కెప్టెన్ గా నోయల్ రెండవసారి గెలవడం విశేషం. మొదటిసారి హౌజ్ మేట్స్ ఓటింగ్ తో కెప్టెన్సీ రాగా.. ఈసారి హెడ్ బ్యాట్ టాస్క్ లో గెలిచిన వారికి కెప్టెన్ ను చేశారు. అయితే రెండవసారి కెప్టెన్ అయిన దగ్గర నుండి నోయెల్ కు కాస్త ఊపొచ్చినట్టుంది. అందుకే అతను గత రెండు రోజులుగా సరదాగా ఉంటున్నాడు. హౌజ్ మేట్స్ తో కూడా కలుస్తున్నాడు.

గత రెండు మూడు వారాలుగా నోయెల్ పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. అతనికేదో లెగ్ ప్రాబ్లెం ఉందని అన్నారు. అయితే అది మెయిన్ ఎపిసోడ్ లో మాత్రం చూపించట్లేదు. హౌజ్ మేట్స్ అంతా ఆటని ఆటలా ఆడుతుంటే అతను మాత్రం మంచితనం మానవత్వం అని డైలాగులు చెబుతుంటాడు. అయితే సెకండ్ టైం కెప్టెన్ గా అయినప్పటి నుండి నోయెల్ లో మార్పు వచ్చింది. అతను ఇప్పుడు హౌజ్ లో జరిగే అన్ని యాక్టివిటీస్ తో చురుగ్గా పాల్గొంటున్నాడు. మరి కుర్రాడు కెప్టెన్ అయితేనే ఇలా యాక్టివ్ గా ఉంటాడా మిగతా టైం లో ఉండడా అని అంటున్నారు ఆడియెన్స్.

ఏది ఏమైనా నోయెల్ మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. మరి నోయెల్ ఇలానే ఆట కొనసాగిస్తాడా మళ్లీ కెప్టెన్సీ ముగియగానే సైలెంట్ అవుతాడా అన్నది చూడాలి. గడిచిన ఐదు వారాల్లో నోయెల్ మొదటి రెండు వారాలు హడావిడి చేసినా మధ్యలో పూర్తిగా సైలెంట్ అయ్యాడు. మరి ఇకనుండైనా నోయెల్ మారుతాడేమో చూడాలి.                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: