బిగ్ బాస్ హౌజ్ లో శుక్రవారం ఎపిసోడ్ కెప్టెన్ నోయెల్ వర్సెస్ కుమార్ సాయికి పడినట్టు ఉంది. ఈరోజు టాస్క్ లో అందరు డిప్స్ కొడుతున్నారు ఈ క్రమంలో కుమార్ సాయి గురించి నోయెల్ కామెంట్ చేశాడు. అమ్మా రాజశేఖర్ కుమార్ సాయికి ఏదో చెబుతుంటే అది తను వినట్లేదు ఆ టైం లో నోయెల్ కుమార్ సాయి ఒక్కరోజైనా నిజాయితీగా ఉండమని అంటాడు. దానికి సీరియస్ అయిన కుమార్ సాయి బ్రదర్ అది చాలా పెద్ద స్టేట్మెంట్ నేనైతే అలా మిమ్మల్ని అననని అంటాడు.

హౌజ్ లో నోయెల్ మొదటి నుండి కుమార్ సాయిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అయితే గత రెండు వారాలుగా కొద్దిగా వెనకపడ్డట్టు కనిపించిన నోయెల్ మరోసారి కెప్టెన్ అయ్యాక రెచ్చిపోతున్నాడు. సెకండ్ టైం కెప్టెన్ అయిన దగ్గర నుండి నోయెల్ జోష్ గా కనిపిస్తున్నాడు. మరి ఇన్నాళ్లు ఈ జోష్ ఏమైందో అతనికే తెలియాలి. హౌజ్ లో అందరికి తెలిసిన పరిచయంగా నోయెల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకోగా అతను మాత్రం టాస్కుల్లో కూడా పెద్దగా ఆకట్టుకోవట్లేదు. మొదటి రెండు వారాలు నీ ఆట నువ్వు ఆడు వేరే వాళ్లకి సలహా ఇవ్వకని నాగ్ చెప్పాడు.

అప్పటినుండి నోయెల్ సైలెంట్ అయ్యాడు. ఇక ఇప్పుడు సెకండ్ టైం కెప్టెన్ అయ్యాక నోయెల్ రెచ్చిపోతున్నాడు. అయితే మిగతా హౌజ్ మేట్స్ ఏమో కాని నోయెల్ మాత్రం కుమార్ సాయిని మొదటి నుండి టార్గెట్ చేస్తున్నాడని అనిపిస్తుంది. ఇక ఈ వారం 9 మంది నామినేషన్స్ లో ఉండగా నోయెల్, కుమార్ సాయి ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు. నోయెల్ కెప్టెన్ అయినా కూడా ఇమ్యునిటీ లేదని బిగ్ బాస్ చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: