ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా రెడ్. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో రామ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడగా సినిమాకు ఓటిటి ఆఫర్లు వచ్చినా సరే నో చెప్పారు. ఇక రామ్ రెడ్ సినిమా ఇప్పటికే లాభాల్లో ఉందని తెలుస్తుంది. రెడ్ సినిమాలో నభా నటేష్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ నటిస్తున్నారు.

రామ్ రెడ్ సినిమాకు శాటిలైట్, హిందీ రైట్స్ రూపంలో మంచి ఆఫర్లు వచ్చాయట. ఓటిటి రిలీజ్ చేయకపోయినా సరే హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ తోనే రామ్ రెడ్ సినిమాకు లాభాలు వచ్చాయని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న రాం ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. తప్పకుండా రెడ్ కూడా అంచనాలకు తగినట్టుగా ఉంటుందని చెప్పొచ్చు. కిశోర్ తిరుమలతో రామ్ ఆల్రెడీ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేశాడు. రెడ్ సినిమా హ్యాట్రిక్ గా వస్తుంది.

మరి రామ్ రెడ్ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. దసరా కానుకగా సినిమా రిలీజ్ అనుకున్నారు కాని చిత్రయూనిట్ ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదు. ఈ సినిమా తర్వాత రామ్ ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమాకు ముందు బడ్జెట్ సమస్యలు రాగా రామ్ ఇస్మార్ట్ కలక్షన్స్ చూసి నిర్మాతలు రిస్క్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: