లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. వరస అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్స్ లో జాబితాలో చేరారు ఈ భామ. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక గత కొంత కాలంగా కాజల్ పెళ్లిపై వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కాజల్ అక్టోబర్ 30న పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది.

ఇటీవలే కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కాజల్ చిన్ననాటి స్నేహితుడు అయినా ముంబయికి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్చును ప్రేమ వివాహం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇక వీరిద్దరి పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా జరుగబోతున్నదట. ఇరు కుటుంబాలకు చెందిన 30 నుంచి 40 మంది మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందకు తానుచాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నందకు మీ సపోర్ట్ కావాలని..తమను  ఆశీర్వదించాలని కోరింది. పెళ్లి తర్వాత కూడా తాను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని తెలియజేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఇక టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆహ్వానం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ సీత కవచం చిత్రాల్లో కలిసి నటించారు. అయితే కాజల్ కు తెలుగు సినీ పరిశ్రమలో బెల్లంకొండ శ్రీనివాస్ బెస్ట్ ఫ్రెండ్. కాజల్ ఎంగేజ్మెంట్ కు కూడా అతడు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. బెల్లంకొండ కాజల్ ప్రేమించుకున్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని వాళ్లు కొట్టి పారేశారు. ఈ క్రమంలో బెల్లంకొండ కాజల్ పెళ్లికి వెళ్తున్నట్లు చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తున్నది. ఇప్పటికే మెగాస్టార్ ఆచార్యలో కాజల్ నటిస్తున్నది. మరికొన్ని తమిళ సినిమాలకు కూడా ఆమె సైన్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: