పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కెరియర్ లో మొదటిసారి పనిచేస్తున్నారు మ్యూజిక్ డైరక్టర్ థమన్. వకీల్ సాబ్ నుండి వచ్చిన మగువా సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ తో వరుస ఛాన్సులు అందుకుంటున్నాడు థమన్.  

వకీల్ సాబ్ తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్ లో పెట్టిన పవన్ ఆ తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ దసరా సందర్భంగా వచ్చింది. సాగర్ చంద్ర డైరక్షన్ లో ఈ సినిమా తెరకెకుతుందని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీసినిమా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ చేస్తున్న సినిమాలు నాలుగైదు ఉండగా వాటిలో ఏకే రీమేక్ కు మాత్రం థమన్ మ్యూజిక్ ఫిక్స్ చేశారు. ఇదే కాకుండా మిగతా మూడింటిలో కూడా థమన్ కు మరో ఛాన్స్ వచ్చేలా ఉంది. మొత్తానికి పవర్ స్టార్ తో సినిమా లేట్ అయినా థమన్ వరుస ఛాన్సులు అందుకుంటూ తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న థమన్ తన సత్తా చాటుతూ దుమ్ముదులిపేస్తున్నాడు. సినిమా ఎనౌన్స్ మెంట్ గా వచ్చిన 48 సెకన్ల టీజర్ లో థమన్ సత్తా చాటాడు. చూస్తుంటే మరోసారి థమన్ అదరగొట్టడం ఖాయమని తెలుస్తుంది.                  



మరింత సమాచారం తెలుసుకోండి: