బిగ్ బాస్ 4లో అరియానా తన పర్ఫార్మెన్స్ తో అందరిని మెప్పిస్తుంది. మొదటి నుండి ఆట మీద ఫుల్ ఫోకస్ గా ఉంటూ వస్తున్న అరియానా హోస్ట్ నాగార్జున మాత్రమే కాదు గెస్ట్ హోస్ట్ గా వచ్చిన సమంత కూడా ఆమె టాలెంట్ ను మెచ్చుకుంది. టాస్క్ ఏదైనా సరే హౌజ్ లో ఉన్న లేడీ కంటెస్టంట్స్ లో అరియానా ది బెస్ట్ ఇచ్చేస్తుంది. ప్రతి టాస్క్ లో ఆమె టఫ్ ఫైట్ చేస్తుంది. అయితే హౌజ్ లో ఉన్న జెంట్స్ తో ఈక్వల్ గా ఫిజికల్ టాస్కులు చేయడం కష్టం కాని అరియానా మాత్రం మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టేస్తుంది.

లేటెస్ట్ గా మంగళవారం ఎపిసోడ్ లో బిబి డే కేర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో చిన్నపిల్లలా అరియానా అదరగొట్టింది. హౌజ్ లో అందరి కన్నా చిన్నదైన అరియానా ఈ టాస్క్ లో ఆటాడుకుంటుంది. ఇక ఈ టాస్క్ లో తన కేర్ టేకర్ గా ఉన్న సోహెల్ ను కూడా ఆమె టార్గెట్ చేసింది. మొన్న జరిగిన నామినేషన్స్ లో సోహెల్ అరియానాని నామినేట్ చేయడంతో ఆ పగ కూడా ఆమె ఈ టాస్క్ లో తీర్చుకుంటుందని చెప్పొచ్చు.

నామినేషన్స్ లో ఉన్న అరియానా టాస్కుల్లో తన బెస్ట్ ఇస్తూ ప్రతి వారం తనకు ఓట్లేస్తున్న ఆడియెన్స్ ను సాటిస్ఫై చేస్తుంది. చూస్తుంటే తప్పకుండా అరియానా టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అయితే ఈసారి హౌజ్ లో ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ కన్నా ఆట ఆడే వారికి ఆడియెన్స్ ఎక్కువ క్రేజ్ ఏర్పడుతుంది.                                         

మరింత సమాచారం తెలుసుకోండి: