బిగ్ బాస్ సీజన్ 4 లో ఎట్టకేలకు అరియానా గ్లోరీ కెప్టెన్ అయ్యింది. హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా తన ఆటతీరుతో ఆడియెన్స్ ను మెప్పిస్తున్న అరియానా లాస్ట్ వీక్ కెప్టెన్ గా చివరి నిమిషంలో మిస్ అవగా ఈవారం కెప్టెన్ గా ఆమె గెలిచింది. అసలు ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది అంటే హౌజ్ లో జెంట్స్ కు సర్కిల్ లో ఓ కీ పెట్టి ఆ కీ తాము కెప్టెన్ గా చేయాలనుకుని సపోర్ట్ చేసే వారికి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు.

అలా కెప్టెన్ గా అవ్వాలనుకునే లేడీ కంటెస్టంట్స్ కు ఆ కీ ఇస్తే వారు ఆ కీ సహాయంతో బాక్స్ లో ఉన్న చాకుని తీసి అక్కడ ఓ చెట్టు మీద కెప్టెన్సీకి ఎవరు అనర్హులో వారి ఫోటో ఉన్న యాపిల్ తీసి కట్ చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన మూడు ఛాన్సుల్లో మొదటిసారి కీ అఖిల్ గెలిచి మోనాల్ కు ఇవ్వగా ఆమె హారికను కెప్టెన్ గా అనర్హురాలని చెప్పింది. ఇక సెకండ్ టైం కీ మెహబూబ్ కు రాగా అతను అరియానాకి కీ ఇచ్చాడు. ఆమె లాస్యని కెప్టెన్ గా అనర్హురాలని చెప్పింది.

ఇక చివరగా మూడో రౌండ్ లో అమ్మా రాజశేఖర్ కీ సాధించి అరియానాకు ఇచ్చాడు. దానితో మోనాల్ ఫోటో ఉన్న యాపిల్ ఆమె కట్ చేసింది. ఇలా అరియానా లాస్ట్ వీక్ కెప్టెన్ గా చివరి నిమిషంలో కోల్పోగా ఈ వారం కెప్టెన్ గా గెలిచింది. మొత్తానికి అరియానా నెక్స్ట్ వీక్ ఇమ్యునిటీ పొందే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: