లాక్‌డౌన్‌ సమయంలో హీరోలు కథలు వింటున్నారేగానీ.. రూపాయి సంపాదనలేదు. సెట్స్‌పై ఉన్న సినిమాలనే  పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఓ హీరో మాత్రం... సైడ్‌ బిజినెస్‌తో డబ్బులు బాగానే వెనకేసుకుంటున్నాడు. కరోనా పరిస్థితుల్లో డబ్బులు ఓ రేంజ్ లో సంపాదిస్తున్న ఆ హీరో ఎవరో కాదు మహేశ్ బాబు.  

సూపర్ స్టార్ మహేశ్ బాబు మహేశ్‌ కెమెరా ముందుకొచ్చి 10  నెలలు దాటింది. సంక్రాంతికి ముందు సరిలేరునీకెవ్వరు షూటింగ్‌లో పాల్గొన్నాడు. కరోనా టైంలో ఇంటికే పరిమితమైపోయి... పిల్లలతో గడిపేశాడు. నెక్ట్స్‌ మూవీ సర్కారువారి పాట ఎప్పుడు  మొదలవుతుందో తెలియని పరిస్థితుల్లో సూపర్‌స్టార్‌ అభిమానులు  ఉన్నా.. మహేశ్‌ మాత్రం కూల్‌గా సంపాదించేస్తున్నాడు. ఆ మధ్య ఒకసారి.. రీసెంట్‌గా మరోసారి యాడ్‌ షూట్‌లో పాల్గొన్నాడు మహేశ్‌. రీసెంట్‌గా జరిగిన షూట్‌లో మహేశ్‌కు మేకప్ చేస్తున్న స్టిల్‌ను నమ్రత పోస్ట్‌ చేసింది.

సర్కారువారి పాట షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్‌ చేశారు. చిత్ర యూనిట్‌కు వీసాలు రావడానికి సమయం పట్టనుంది. ఈ లోగా.. ఖాళీగా లేకుండా..  యాడ్స్‌ చేస్తూ.. నాలుగు కోట్లు వెనకేసుకుంటున్నాడు మహేశ్‌ బాబు. లేటెస్ట్‌ యాడ్‌లో మహేశ్‌ మీసకట్టు... పంచెకట్టుతో సంప్రదాయబద్ధంగా కనిపించాడు. భరత్‌ అనే నేను తర్వాత  యాడ్‌ కోసం.. పంచె కట్టాడు సూపర్‌స్టార్‌.

తోటి స్టార్స్ బిజీ అయినా.. మహేశ్‌ బాబు సినిమా సర్కారువారి పాట మాత్రం మొదలు కాలేదు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ షూట్‌లో ‌... ప్రభాస్ రాధేశ్యామ్‌తో ఉన్నారు. యాడ్స్‌ కోసం అడపాదడపా మేకప్‌ వేసుకుంటున్న మహేశ్‌ బాబు.. సర్కారు వారి పాట గెటప్‌లోకి ఎప్పుడు వెళ్తాడో మరి.

మొత్తానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు కూల్ గా కోట్లు సంపాదించేస్తున్నాడు. 10నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మహేశ్ బాబు.. యాడ్స్ తో బిజీబిజీ అయిపోయాడు. యాడ్స్ కాసులు కురిపిస్తుండటంతో.. కరోనా సమయంలో బాగానే వెనకేసుకున్నాడు.తాజాగా మీసకట్టు.. పంచె కట్టుతో అభిమానులను తెగ అట్రాక్ట్ చేస్తున్నాడు.









మరింత సమాచారం తెలుసుకోండి: