పెళ్లి చేసుకున్న చందమామ... శోభనం సెటప్పు సముద్రం మధ్యలో వేసింది..! కొన్ని ఫోటోలు కూడా షేర్‌ చేసింది.  ఇంకేముంది? ఆ గెటప్పు.. సెటప్పు చూసి.. ఒక్కొక్కరు ఒక్కోలా సెటైర్‌ వేస్తున్నారు.

హీరోయిన్‌ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు పెళ్లి ఓరేంజ్‌లో జరిగింది. తర్వాత వారం రోజుల్లోనే హనీమూన్‌ పెట్టుకుని విదేశాలకు చెక్కేసిందీ జంట. ఇదంతా కామనే అయినా... వాళ్ల హనీమూన్‌ ప్లేసు.. దాని కాస్ట్ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.  వీరిద్దరూ ఇప్పుడు మాల్దీవుల్లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక్కడ వెరైటీ ఏంటంటే.. సముద్రంలో వీరి రొమాన్స్‌ సాగుతోంది. అదేనండీ.. .అండర్‌ సీ విల్లాలో ఫుల్‌గా పీకల్లోతు ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్‌ అవుతున్నాయి.

కాజల్ జంట మాలేలో ఉంటున్న అండర్ సీ విల్లా ఒక్కరోజు రెంట్‌ ఎంతో తెలుసా..? అక్షరాలా 36 లక్షలట.  అవునుమరి.. పేదోడు పెళ్లి చేసుకుంటే గుడిసెలోనే శోభనం..!  అదే ఉన్నోళ్లు... మరీ ముఖ్యంగా ఇలా ఎంజాయ్‌ చేయాలన్న ఉబలాటమున్నోళ్లు... తలచుకుంటే భూతల స్వర్గాలు ఎన్నో ఉన్నాయ్‌.

మాల్దీవుల విషయానికి వస్తే... చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులు.. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు.. ఓ మనిషి తన జీవితాన్ని సరదాగా గడపడానికి ఇంతకంటే అందమైన ప్రాంతం మరొకటి ఉండదేమో..! అందుకే.. ఎప్పుడూ బిజీగా ఉండే సినీతారలు కొంచెం విశ్రాంతి దొరికినా సరే మాల్దీవుల్లో వాలిపోతుంటారు. అందుకే నటి కాజల్ అగర్వాల్ తన భర్తతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.  ఏముందిలే డబ్బు ఉంటే రోజుకు 36 లక్షలు కాదు కోటి రూపాయలు ఖర్చు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదన్నాడు.. ఈ చందమామ ఫోటో చూసిన ఓ నెటిజన్‌.

మొత్తానికి కాజల్-గౌతమ్ ల హనీమూన్ హాట్ టాపిక్ గా మారింది. మాల్దీవుల్లో ఆ జంట ఎంజాయ్ చేస్తోంది. ఆహ్లాదకరమైన ప్రకృతిలో సేదతీరుతున్నారు. ఇదే ఇపుడు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: