అభిజిత్ కు అఖిల్, సోహెల్, అరియానా, అవినాష్ లు నామినేట్ చేశారు. అఖిల్, అభిజిత్ ల మధ్య నామినేషన్ ఫైట్ భారీగానే జరిగింది. కెప్టెన్ అయ్యాడు కాబట్టి అఖిల్ ను నామినేట్ చేయకుండా అభిజిత్ వదిలి పెట్టాడు. ఇక వీరితో పాటుగా సోహెల్, హారికల మధ్య వాదన కూడా బాగా జరిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికి ధర్మాకోల్ షీట్స్ ఇచ్చి కత్తితో వారి హృదయాలను గుచ్చాల్సి ఉంటుంది. దీనిలో అభిజిత్ కు అత్యధిక నామినేషన్ ఓట్స్ వచ్చాయి.
ఇక ఈ వారం నామినేషన్స్ చూస్తే ఉన్న ఆరుగురిలో అందరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అయితే ఈ వారం మోనాల్ హౌజ్ నుండి బయటకు వెళ్లే ఛాన్సులు ఉన్నట్టు చెప్పొచ్చు. మోనాల్ సేఫ్ అయితే మాత్రం హారిక, అరియానా, సోహెల్ ల మీద ఎలిమినేషన్ కత్తి ఉండే ఛాన్స్ ఉంది. మరి 11 వ వారం హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో వీకెండ్ లో తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి