పెళ్లినాటికి కాజల్ తెలుగు, తమిళం... హిందీ సినిమాల్లో బిజీగా వుంది. హానీమూన్ ట్రిప్ నుంచి రాగానే.. ముందుగా ఆచార్య షూట్‌లో పాల్గొంటుంది. డిసెంబర్ 5నుంచి చిరంజీవి, కాజల్ పాల్గొనే సీన్స్ చిత్రీకరిస్తారట. కరోనా తర్వాత ఆచార్యను ఆగస్ట్‌లో మొదలుపెడితే.. తన పార్ట్ కంప్లీట్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంది కాజల్. అయితే.. ఈమధ్యనే రెగ్యులర్ షూట్‌లోకి వెళ్లాడు ఆచార్య.
పెళ్లి తర్వాత ఎక్కడ తనను పక్కన పెడతారన్న భయంతో.. యాక్టింగ్ కంటిన్యూ చేస్తానని ముందే చెప్పేసింది కాజల్. ఈమధ్య కాలంలో సక్సెస్‌లేని చందమామకు కెరీర్ గాడిలో పడాలంటే ఆచార్య హిట్ చాలా అవసరం. ఆమధ్య 2 కోట్లు డిమాండ్ చేసిన ఈ అమ్మడు.. సక్సెస్ లేక కోటి ఇస్తే చాలంటోంది. మూడేళ్ల క్రితం వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత తెలుగులో సక్సెస్ దక్కలేదు. దీంతో స్టార్స్ ఈ అమ్మడిని కేర్ చేయడం లేదు. ఆచార్యలో చాన్స్ కూడా అనుకోకుండా.. త్రిష తప్పుకుంటేనే వచ్చింది. మరి ఈ బంపర్ ఆఫర్ కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. మొత్తానికి హనీమూన్ ట్రిప్ లో ఉన్న కాజల్ కు మెగాస్టార్ నుంచి ఎట్టకేలకు పిలుపు వచ్చింది. ఆచార్య సినిమాలో చిరంజీవితో నటిస్తున్న ఈ అమ్మడు.. మళ్లీ కెమెరా ముందుకు వస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి