స్ట్రైట్‌ మూవీ తీస్తే ఏ గొడవా వుండదు. అంచనాలుండవు. అదే రీమేక్‌ తీస్తే.. తెలుగులో ఎలా తీస్తారు? నటీనటులు ఎలా యాక్ట్‌ చేస్తారన్న ఆసక్తి పెరుగుతుంది. ఇక సీక్వెల్‌ తీస్తుంటే.. ఫస్ట్ పార్ట్‌ను మించి ఎలా తీస్తారన్న ఎగ్జయిమెంట్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఢీ సీక్వెల్‌ డి అండ్‌ డి పరిస్థితి కూడా ఇలాగే వుంది. మరి రెండు ఢీస్‌తో వస్తున్న ఈ సీక్వెల్‌కు కొన్ని అడ్డంకులున్నాయి.

శ్రీనువైట్ల డైరెక్ట్‌ చేసిన  ఢీ మూవీ విష్ణు కెరీర్‌లో తొలి హిట్‌గా నిలిచింది.  సినిమా వచ్చి 13 ఏళ్లయినా ఇంతవరకు ఈ కాంబోలో మరో మూవీ రాలేదు. వరుస ఫ్లాపుల్లో వున్న ఈ ఇద్దరూ మరోసారి చేతులు కలిపారు. ఢీ తో వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుని.. 'డి అండ్‌ డి' అంటూ విష్ణు బర్త్ డే సందర్భంగా సీక్వెల్‌ ఎనౌన్స్‌ చేశారు. ఈ సినిమాకు హీరోనే నిర్మాత. 'డి అండ్‌ డి' అంటే ఏమిటో క్లారిటీ ఇవ్వడానికి 'డబుల్‌ డోస్‌' అన్న ట్యాగ్‌లైన్‌ పెట్టారు. డీని మించి డబుల్‌  ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటుందని ముందే చెప్పేశాడు.

రెండు సంకెళ్ల మధ్యలో డి అండ్‌ డి అని ఫిక్స్‌ చేసిన టైటిల్‌ డిఫరెంట్‌గా వుంది. కథ జైల్లో నడిచేలా.. అక్కడే కామెడీ పండేలా టైటిల్‌ వుంది. డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. ఢీలో నటించిన ఇద్దరు యాక్టర్స్‌ జయప్రకాష్‌రెడ్డి.. శ్రీహరి చనిపోయారు. మాట లేకుండా జయప్రకాష్‌రెడ్డి హావభావాలు.. తెలంగాణ యాసలో శ్రీహరి డైలాగ్స్ సినిమాకు ప్లస్‌ అయ్యాయి.

బ్రహ్మానందం పీక్స్‌లో  వున్న టైంలో 'ఢీ' వచ్చింది. 'రావుగారు నన్ను ఇన్వాల్వ్‌ చేయొద్దంటూ.. ఆయన పండించిన హాస్యం.. ఇప్పటికీ నవ్విస్తూనే వుంటుంది. బ్రహ్మానందం ప్రస్తుతం ఫామ్‌లో లేడు. ఆయన ప్లేస్‌ను వెన్నెల కిషోర్‌తో భర్తీ చేస్తారేమో.  ఏదేమైనా.. ఢీని మించి డబుల్‌ డోస్‌ వుంటేనే.. డి అండ్‌ డి హిట్‌ అవుతుంది. ఈ విషయం శ్రీనువైట్లాకు తెలీంది కాదు.  ట్రాక్‌ తప్పిన తన కెరీర్‌ను నిలబెట్టుకోవాలంటే.. ఈ హిట్‌ చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: